థాయ్‌లాండ్ రాజ్యాంగ న్యాయస్థానం పేటోంగ్టార్న్ షినవత్రను 2025, ఆగస్టు 29న ప్రధాని పదవి నుంచి తొలగించింది.
కంబోడియా సెనేట్ అధ్యక్షుడు హన్‌సేన్‌తో ఫోనులో మాట్లాడి.. షినవత్ర నైతిక ప్రమాణాలను ఉల్లంఘించినట్లు రుజువయ్యిందని.. రాజ్యాంగం ప్రకారం ఇటువంటి వారికి ప్రధాని స్థానంలో ఉండే అర్హత లేదని న్యాయస్థానం పేర్కొంది.
షినవత్రను ప్రధాని స్థానం నుంచి తొలగించడంతో నూతన ప్రధానిని ఎన్నుకునే వరకూ దేశ ఉప ప్రధాని ఫుమ్తామ్ వెచాయాచాయ్ ఆపద్ధర్మ ప్రధాని హోదాలో సేవలందిస్తారని అధికారులు పేర్కొన్నారు.