Published on Oct 27, 2025
Current Affairs
థాయ్‌లాండ్‌ ‘క్వీన్‌ మదర్‌’ కన్నుమూత
థాయ్‌లాండ్‌ ‘క్వీన్‌ మదర్‌’ కన్నుమూత

సంప్రదాయ చేతి వృత్తులు, అడవులను రక్షించేందుకు కృషిచేసిన థాయ్‌లాండ్‌ ‘క్వీన్‌ మదర్‌’ సిరికిట్‌ కిటియాకర (93) 2025, అక్టోబరు 25న బ్యాంకాక్‌లో మరణించారు.

సిరికిట్‌ పుట్టినరోజును థాయ్‌లాండ్‌ ప్రజలు మాతృదినోత్సవంగా జరుపుకొంటారు.

1932, ఆగస్టు 12న ఓ ధనిక కుటుంబంలో సిరికిట్‌ జన్మించారు.

1950లో ఆమె అప్పటి రాజు భూమీబల్‌ అదుల్యతేజ్‌ను వివాహమాడారు. వీరికి ప్రస్తుత థాయ్‌లాండ్‌ రాజు మహా వజిరాలాంగ్‌కార్న్‌ సహా నలుగురు సంతానం. 

అంతరించిపోతున్న సముద్ర తాబేళ్లను కాపాడేందుకు వన్యప్రాణుల పెంపక కేంద్రాలు, బహిరంగ జంతుప్రదర్శనశాలలను ఏర్పాటుచేసిన సిరికిట్‌ను గ్రీన్‌ క్వీన్‌గా పిలుస్తారు.