గ్రామీణాభివృద్ధి శాఖకు 2025-26 బడ్జెట్‌లో కేటాయించిన రూ.1,90,406 కోట్లలో గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్), ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన(పీఎంఏవైజీ) పథకాలు 75 శాతం నిధులను కలిగి ఉన్నాయని థింక్‌ట్యాంక్ పీఆర్‌ఎస్ లెజిస్లేటివ్ తాజా నివేదిక వెల్లడించింది.
2024-25 నాటి సవరించిన అంచనాల కంటే 8 శాతం అధికంగా గ్రామీణాభివృద్ధి శాఖకు నిధులు లభించాయని, భూ వనరుల శాఖకు 35 శాతం అధికంగా రూ.2,651 కోట్లు లభించినట్లు తెలిపింది.
గ్రామీణాభివృద్ధి శాఖ బడ్జెట్‌లో ఫ్లాగ్‌షిప్ కేటాయింపులో భాగంగా ఉపాధి హామీ పథకానికి 46 శాతం, పీఎమ్‌ఏవైజీకి దాదాపు 29 శాతం చొప్పున నిధుల కేటాయింపు జరిగినట్లు పేర్కొంది.
వీటి తర్వాత జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్, పీఎంజీఎస్‌వైలకు పదిశాతం చొప్పున, నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రాంకు 5 శాతం చొప్పున కేటాయించారు.