పశ్చిమ బెంగాల్‌లోని తీస్తా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో ‘తీస్తా ప్రహార్’ పేరుతో భారత సైన్యం భారీ ఎత్తున సైనిక విన్యాసాలు నిర్వహించింది.
నదీ తీర ప్రాంతంలో యుద్ధం సంభవిస్తే ఎలా ఎదుర్కోవాలి.. శత్రువు వ్యూహాలను ఎలా ధ్వంసం చేయాలన్న దానిపై కసరత్తు చేసింది.
ఆయుధ రవాణా, సైనికుల మధ్య సమన్వయం తదితర అంశాలను క్షేత్ర స్థాయిలో పరీక్షించింది.
ఇటీవల భారత సైన్యంలోకి అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ, ఆయుధాలు వచ్చి చేరిన క్రమంలో వాటిని వినియోగించడం, సాంకేతికంగా ఎదురయ్యే సమస్యలపై ఈ విన్యాసాల్లో ప్రధానంగా దృష్టి సారించింది.