తైవాన్‌కు 200 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాల విక్రయానికి అమెరికా ఆమోదం తెలిపింది. వీటిలో ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలపైకి క్షిపణులను ప్రయోగించే అధునాతన ‘నాసామ్స్’ వ్యవస్థ కూడా ఉంది.
ఈ తరహా ఆయుధ వ్యవస్థను తైవాన్‌కు ఇవ్వజూపడం ఇదే తొలిసారి. దీని ధర 116 కోట్ల డాలర్లు. 82.8 కోట్ల డాలర్ల విలువైన రాడార్ వ్యవస్థలనూ అమెరికా సరఫరా చేయనుంది.