దేశంలో నిత్యం కోట్లాదిమంది ప్రయాణికులకు సేవలందిస్తున్న భారతీయ రైల్వే 172 ఏళ్లు పూర్తి చేసుకొంది. 1853 ఏప్రిల్ 16న ముంబయి నుంచి ఠాణెకు బయలుదేరిన రైలు దేశంలో తొలి ప్యాసింజర్ రైలుగా చరిత్రలో నిలిచిపోయింది. ఆ తేదీన మధ్యాహ్నం 3.35 గంటలకు 14 కోచ్‌లతో కూడిన రైలు ముంబయిలోని బోరీబందర్ నుంచి ఠాణెకు ప్రయాణించింది. 21 తుపాకులతో సెల్యూట్ చేశారు. ఆహ్వానం ఉన్న 400 మంది అందులో ప్రయాణించారు. సింధ్, సుల్తాన్, సాహెబ్ పేర్లు కలిగిన మూడు ఇంజిన్లతో రైలు ప్రారంభమైంది. 34 కి.మీ.ల దూరం 1.15 గంటల్లో చేరుకుంది. నాటి నుంచి భారతీయ రైల్వే సేవలు అందిస్తూనే ఉంది.