ప్రముఖ కథక్ నాట్యాచార్యుడు రాఘవరాజ్ భట్‌కు ప్రతిష్ఠాత్మక తులసి సమ్మాన్ పురస్కారం లభించింది.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం, ఆ రాష్ట్ర సాంస్కృతిక శాఖ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి ఏటా పురస్కారాలు అందజేస్తోంది.
ఆర్ట్స్ అకాడమీ ద్వారా జానపద కళల పరిరక్షణకు చేస్తున్న కృషికిగానూ 2025 ఏడాది తెలుగు రాష్ట్రాల నుంచి రాఘవరాజ్ భట్‌ను ఎంపిక చేశారు.
మధ్యప్రదేశ్ గవర్నర్ మంగూభాయ్ సి.పటేల్ చేతుల మీదుగా ఆయన పురస్కారం అందుకున్నారు.