తెలుగు విశ్వవిద్యాలయానికి తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి పేరును పెట్టే బిల్లుకు శాసనసభ 2025, మార్చి 17న ఆమోదం తెలిపింది.
గవర్నర్ ఆమోదముద్ర వేసిన వెంటనే రికార్డుల్లో పేరు మారనుంది. పేరు మార్పునకు సంబంధించిన బిల్లును వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ శాసనసభలో ప్రవేశపెట్టారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1983లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చొరవతో విశ్వవిద్యాలయం ఏర్పాటైంది.