Published on May 28, 2025
Admissions
తెలుగు వర్సిటీలో పీజీ, యూజీ, పీజీ డిప్లొమా, డిప్లొమా ప్రోగ్రామ్‌
తెలుగు వర్సిటీలో పీజీ, యూజీ, పీజీ డిప్లొమా, డిప్లొమా ప్రోగ్రామ్‌

తెలంగాణ మెడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా, బాచుపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం 2025-26 విద్యా సంవత్సరానికి డిగ్రీ, ఎంఏ డిగ్రీ, యూజీ, పీజీ, పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికేట్‌ రెగ్యులర్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రవేశ పరీక్ష ఆధారంగా విద్యార్థుల ప్రవేశాలు ఉంటాయి. ప్రవేశాల నోటిఫికేషన్‌ ద్వారా తెలుగు వర్సిటీలో రెగ్యులర్‌ కోర్సులైన శిల్పం, చిత్రలేఖనం, డిజైన్స్‌, సంగీతం, రంగస్థలం, నృత్యం, జానపదం, తెలుగు, చరిత్ర, పర్యాటకం, భాషాశాస్త్రం, జర్నలిజం, జ్యోతిషం, యోగా తదితర అంశాలలో ఎంఏ డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్‌, అండర్‌ గ్రాడ్యుయేషన్‌, పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులలో ప్రవేశాలు పొందవచ్చు. 

వివరాలు:

బీఎఫ్‌ఏ (నాలుగేళ్లు), బీడిజైన్ (నాలుగేళ్లు)

ఎంఎఫ్‌ఏ (రెండేళ్లు), 

ఎంఏ జర్నలిజం అండ్‌ మాస్ కమ్యూనికేషన్ (రెండేళ్లు), ఎంఏ/ ఎంపీఏ (రెండేళ్లు), ఎంఏ (తెలుగు, చరిత్ర, సంస్కృతి, పర్యాటకం) (రెండేళ్లు), ఎండిజైన్ (రెండేళ్లు) తదితరాలు.

పీజీ డిప్లొమా ప్రోగ్రామ్

డిప్లొమా ప్రోగ్రామ్

సర్టిఫికెట్ ప్రోగ్రామ్

అర్హత: కోర్సను అనుసరించి ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

ప్రవేశ ప్రక్రియ: రెగ్యులర్‌ ప్రోగ్రాముల్లో ప్రవేశ పరీక్ష ఆధారంగా ప్రవేశం ఉంటుంది. 

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, వరంగల్‌.

ఆన్‌లైన్‌ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 24.06.2025.

ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: 30.06.2025.

Website:https://teluguuniversity.ac.in/