తెలంగాణ, దిల్లీ, ఝార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 2025, మార్చిలో అతి తక్కువ ద్రవ్యోల్బణం నమోదైంది.
దేశవ్యాప్తంగా సగటున 3.34% నమోదు కాగా.. తెలంగాణలో 1.06%, దిల్లీలో 1.48, ఝార్ఖండ్‌లో 2.08, ఆంధ్రప్రదేశ్‌లో 2.50 శాతానికి పరిమితమైంది.
తెలంగాణ తొలి, ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానాల్లో నిలిచాయి. అత్యధిక ద్రవ్యోల్బణంలో కేరళ మొదటి స్థానంలో నిలిచింది.
మార్చిలో తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో 0.20%, పట్టణ ప్రాంతాల్లో 1.79%, ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో 2.14%, పట్టణ ప్రాంతాల్లో 3.13% మేర ద్రవ్యోల్బణం నమోదైంది.