వివిధ పద్దుల కింద 2021-22 నుంచి 2023-24 మధ్యకాలంలో తెలంగాణకు రూ.1.22 లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.1.48 లక్షల కోట్లకుపైగా నిధులు విడుదల చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఆర్థిక సంఘం నిధులు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, అదనపు కేంద్ర సాయం, విదేశీ ఆర్థికసాయంతో చేపట్టే ప్రాజెక్టులు, ప్రత్యేక సాయం కింద ఈ నిధులు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి 2024, నవంబరు 25న లోక్‌సభలో పేర్కొన్నారు.
ఏపీలో 63, తెలంగాణలో 21 పులులు
2022 లెక్కల ప్రకారం తెలంగాణలో 21, ఆంధ్రప్రదేశ్‌లో 63 పులులున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్‌సింగ్ 2024, నవంబరు 25న లోక్‌సభలో పేర్కొన్నారు.