తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ న్యాయశాఖ మంత్రిత్వ శాఖ, సబార్డినేట్ సర్వీస్ కోసం వివిధ విభాగాల్లో ఉద్యోగల భర్తీకి తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 1673 (1277 టెక్నికల్, 184 నాన్-టెక్నికల్ , తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్, సబార్డినేట్ సర్వీస్ కింద 212 ఖాళీలు).
వివరాలు:
పోస్టులు: స్టెనోగ్రాఫర్ గ్రేడ్ III, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్, కంప్యూటర్ అపరేటర్, సిస్టమ్ అనలిస్ట్.
అర్హత: పదోతరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18 - 34 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు; పీడీబ్ల్యూడీ (జనరల్/ ఈడబ్ల్యూఎస్) అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.600; ఎస్టీ/ ఎస్సీ/ ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్‌మెన్, పీడబ్ల్యూబీడీఎస్ అభ్యర్థులకు రూ.400.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, మెరిట్ లిస్ట్, స్కిల్ టెస్ట్, షార్ట్ హ్యాండ్ ఇంగ్లిష్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08-01-2025
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31-01-2025
పరీక్ష తేదీలు: టెక్నికల్ పోస్టులకు ఏప్రిల్, నాన్ టెక్నికల్ పోస్టులకు జూన్ 2025
Website:https://tshc.gov.in/