తెలంగాణ హైకోర్టు (టీజీహెచ్‌సీ) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టుల సంఖ్య: 43
వివరాలు:
1. ఆఫీస్ సబార్డినేట్: 34
2. డ్రైవర్: 09
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 7వ తరగతి, టెన్త్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 2026 జులై 1వ తేదీ నాటికి 46 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీకి 5 ఏళ్లు, పీహెచ్ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు రూ.19,000 - రూ.58,850, డ్రైవర్ పోస్టులకు రూ.22,900 - రూ.69,150.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: డ్రైవర్ పోస్టులకు రూ.500, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు జనరల్, బీసీ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ, ఈఎస్‌ఎం అభ్యర్థులకు రూ.400.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష(సీబీటీ), స్కిల్ టెస్ట్ ఆధారంగా.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 2026 ఫిబ్రవరి 7.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 28.