Published on Dec 11, 2025
Current Affairs
తెలంగాణ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ బోర్డు
తెలంగాణ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ బోర్డు
  • తెలంగాణలో ఇంతవరకు పదో తరగతికి ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌కు ఇంటర్మీడియట్‌ బోర్డులు పనిచేస్తుండగా.. వాటిని మిళితం చేసి ‘తెలంగాణ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ బోర్డు (టీజీఎస్‌ఈబీ)’ పేరిట ఒకటే ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ రైజింగ్‌ దార్శనికత పత్రం-2047లో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా కేవలం 6 రాష్ట్రాల్లోనే వేర్వేరు బోర్డులున్నాయని ఇటీవల కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి సంజయ్‌కుమార్‌ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఇప్పుడు ఒకే బోర్డును ప్రతిపాదించింది. 
  • ఈ మేరకు విద్యా ప్రమాణాలు, నాణ్యత, గుర్తింపునకు సంబంధించి అన్ని రకాల పాఠశాలల కోసం తెలంగాణ స్కూల్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ (టీజీఎస్‌ఎస్‌ఏ)ని ఏర్పాటు చేస్తారు. పరీక్షల విధానం, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరీక్షించే విధానాల్లో మార్పులు చేస్తారు.