తెలంగాణలోని మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) వైద్య శాఖలో 1623 సివిల్ అసిస్టెంట్ సర్జన్, మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు:
స్పెషలిస్ట్ డాక్టర్స్: 1623
అర్హతలు: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ/డిప్లొమా/డీఎన్‌బీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 2025 జులై 1వ తేదీ నాటికి 18 నుంచి 46 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు, పీహెచ్ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు రూ.58,850 - రూ.1,37,050.
ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ: 2025 సెప్టెంబర్ 22.