Published on Nov 1, 2025
Current Affairs
తెలంగాణ రాష్ట్ర మంత్రిగా అజారుద్దీన్‌
తెలంగాణ రాష్ట్ర మంత్రిగా అజారుద్దీన్‌

భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మహమ్మద్‌ అజారుద్దీన్‌ (62) తెలంగాణ రాష్ట్ర మంత్రిగా 2025, అక్టోబరు 31న పమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లోని దర్బార్‌ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మ.. అజారుద్దీన్‌తో ప్రమాణం చేయించారు. 1963 ఫిబ్రవరి 8న హైదరాబాద్‌లో జన్మించిన అజారుద్దీన్‌ అబిడ్స్‌లోని ఆల్‌ సెయింట్స్‌ హైస్కూల్‌లో పాఠశాల విద్య, నిజాం కళాశాలలో డిగ్రీ అభ్యసించారు. 1984లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి, తొలి మూడు టెస్టుల్లోనే వరుస సెంచరీలు సాధించి సంచలనం సృష్టించారు.