తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీఎంసీ) డైరెక్ట్/ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు:
1. జూనియర్ అసిస్టెంట్: 01
2. విజిలెన్స్ ఆఫీసర్: 02
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎల్ఎల్‌బీ ఉత్తీర్ణతతో పాటు టీఎస్‌పీఎస్సీ గ్రూపు-4 (2022) ఎంపికైన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి: జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు 44 ఏళ్లు; విజిలెన్స్ ఆఫీసర్ పోస్టులకు 45 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు రూ.24,280-రూ.72850; విజిలెన్స్ ఆఫీసర్ పోస్టులకు రూ.70,000-రూ.50,000.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘ ది చైర్మన్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్, డీఎంహెచ్‌వో క్యాంపస్, సుల్తాన్ బజార్, కోఠి, హైదరాబాద్’ చిరునామకు పంపించాలి.
ఆఫ్‌లైన్ దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ: 11-11-2024.
Website:https://onlinetsmc.in/