Published on Sep 27, 2024
Admissions
తెలంగాణ బీసీ సంక్షేమ గురుకులాల్లో అగ్రి బీఎస్సీ కోర్సు
తెలంగాణ బీసీ సంక్షేమ గురుకులాల్లో అగ్రి బీఎస్సీ కోర్సు

మహాత్మా జ్యోతిబాఫులె బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ నిర్వహించే వనపర్తి, కరీంనగర్‌లోని మహాత్మా జ్యోతిబాఫులె బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ వెల్ఫేర్ రెసిడెన్షియల్ అగ్రికల్చర్‌ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి మొదటి సంవత్సరం బీఎస్సీ(ఆనర్స్‌) అగ్రికల్చర్‌ కోర్సులో ప్రవేశాల‌కు నోటిఫికేష‌న్ విడుదలైంది. ఎంపికైన బాలికలకు ఉచిత విద్య, వసతి సౌకర్యాలు ఉంటాయి.

వివరాలు:

కోర్సు పేరు: బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ (నాలుగేళ్ల వ్యవధి)

కళాశాల, సీట్ల వివ‌రాలు:

1. వ్యవసాయ కళాశాల (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌), వనపర్తి: 18 సీట్లు (అగ్రిసెట్‌ కోటా)

2. వ్యవసాయ కళాశాల (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌), కరీంనగర్: 18 సీట్లు (అగ్రిసెట్‌ కోటా)

అర్హతలు: డిప్లొమా (అగ్రికల్చర్)/ డిప్లొమా (సీడ్ టెక్నాలజీ)/ డిప్లొమా (ఆర్గానిక్ అగ్రికల్చర్‌) ఉత్తీర్ణులైన బాలికలు అర్హులు. పీజేటీఎస్‌ఏయూ అగ్రిసెట్‌ 2024 ర్యాంకు సాధించి ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2,00,000 (పట్టణ ప్రాంతం), రూ.1,50,000 (గ్రామీణ ప్రాంతం) మించకూడదు.

వయసు: 17 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: పీజేటీఎస్‌ఏయూ అగ్రిసెట్‌ 2024 ర్యాంకు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు. 

అప్లికేషన్‌ పీజు: రూ.1000.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 10.10.2024.

దరఖాస్తు సవరణ తేదీలు: 11.10.2024 నుంచి 12.10.2024 వరకు

Website:https://mjptbcwreis.telangana.gov.in/

Apply online:https://ug.mjptbcwreis.net/