Published on Mar 18, 2025
Admissions
తెలంగాణ బీసీ గురుకులాల్లో 6, 7, 8, 9 తరగతుల బ్యాక్‌లాగ్‌ ప్రవేశాలు
తెలంగాణ బీసీ గురుకులాల్లో 6, 7, 8, 9 తరగతుల బ్యాక్‌లాగ్‌ ప్రవేశాలు

మహాత్మా జ్యోతిబాఫులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహించే బీసీ గురుకుల పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశ ప్రకటన వెలువడింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 6, 7, 8, 9వ తరగతుల్లోని ఖాళీ సీట్లు భర్తీ కానున్నాయి. 

వివరాలు:

తెలంగాణ బీసీ గురుకులాల్లో 6, 7, 8, 9తరగతుల బ్యాక్‌లాగ్‌ ప్రవేశాలు (ఇంగ్లిష్‌ మీడియం, స్టేట్‌ సిలబస్‌)

అర్హతలు: విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2022-23 లేదా 2023-24 విద్యా సంవత్సరం విద్యను అభ్యసించి ఉండాలి. ఆరో తరగతికి సంబంధించి అయిదో తరగతి; ఏడో తరగతికి సంబంధించి ఆరో తరగతి; ఎనిమిదో తరగతికి సంబంధించి ఏడో తరగతి; తొమ్మిదో తరగతికి సంబంధించి ఎనిమిదో తరగతి చదివి ఉండాలి. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు రూ.1,50,000, పట్టణ ప్రాంత విద్యార్థులకు రూ.2,00,000కు మించకూడదు.

వయోపరిమితి: 31-08-2024 నాటికి ఆరో తరగతికి పన్నెండేళ్లు; ఏడో తరగతికి పదమూడేళ్లు; ఎనిమిదో తరగతికి పధ్నాలుగేళ్లు, తొమ్మిదో తరగతికి పదిహేనేళ్లు మించకూడదు. 

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.

పరీక్ష విధానం: ప్రవేశ పరీక్ష తెలుగు-15, గణితం-30, సామాన్య శాస్త్రం-15, సాంఘీక శాస్త్రం-15, ఇంగ్లిషు-25 మార్కులతో అబ్జెక్టీవ్‌ విధానంలో ఉంటుంది.

పరీక్ష కేంద్రం: వారి సొంత జిల్లాల్లో మాత్రమే పరీక్ష నిర్వహిస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.150.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 31-03-2025.

హాల్‌టికెట్ డౌన్‌లోడ్‌ తేదీ: 15-04-2025.

ప్రవేశ పరీక్ష తేదీ: 20-04-2025.

అడ్మిషన్‌ ప్రక్రియ ముగింపు తేదీ: 31-07-2025.

Website:https://mjptbcwreis.telangana.gov.in/

Apply online:https://mjptbcadmissions.org/home.do