తలసరి ఆదాయంలో తెలంగాణలోని జిల్లాల మధ్య తీవ్ర అసమానతలు కనిపిస్తున్నాయి. అగ్రస్థానంలో ఉన్న రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం ఏకంగా రూ.11,29,735 ఉండగా... కేవలం రూ.2,37,809తో హనుమకొండ జిల్లా దిగువన ఉంది. రంగారెడ్డి జిల్లా ఆదాయానికి... రూ.4,76,679తో రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్‌కు సైతం చాలా వ్యత్యాసముంది.
మొదటి మూడు స్థానాల్లో రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి... చివరి మూడు స్థానాల్లో వికారాబాద్, జగిత్యాల, హనుమకొండ నిలిచాయి. అయితే, తలసరి ఆదాయంలో జాతీయ సగటు కంటే తెలంగాణలోని 33 జిల్లాలూ ముందున్నాయి. 2025-26లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.4,18,931 కాగా, జాతీయ సగటు రూ.2,19,575 మాత్రమే. తెలంగాణలో తలసరి ఆదాయం వృద్ధిరేటు 10.2గా ఉందని తెలంగాణ సామాజిక నివేదిక-2026 పేర్కొంది.