తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 2026-2027 విద్యా సంవత్సరానికి 5 నుంచి 9వ తరగతుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు:
అర్హతలు: విద్యార్థులు 4, 5, 7వ తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 2026 ఆగస్టు 31వ తేదీ నాటికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు 11 ఏళ్ల నుంచి 17 ఏళ్లు ఉండాలి.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.100.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 జనవరి 21.
రాత పరీక్ష: 2026 ఫిబ్రవరి 22.