Published on Jan 24, 2025
Admissions
తెలంగాణ ఏకలవ్య ఆదర్శ గురుకులాల్లో ఆరో తరగతి ప్రవేశాలు
తెలంగాణ ఏకలవ్య ఆదర్శ గురుకులాల్లో ఆరో తరగతి ప్రవేశాలు

తెలంగాణ రాష్ట్ర ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని 23 ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతిలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. ఎంపికైన విద్యార్థులకు ఉచిత వసతి, భోజనం, విద్య, శిక్షణ అందిస్తారు. బోధనా మాధ్యమం ఆంగ్లంలో సీబీఎస్‌ఈ సిలబస్‌ బోధిస్తారు.

వివరాలు:

పరీక్ష పేరు: ఈఎంఆర్‌ఎస్‌ సెలెక్షన్‌ టెస్ట్‌(ఈఎంఆర్‌ఎస్‌ఎస్‌టీ)- 2025

సీట్ల వివరాలు: ప్రతి ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయంలో ఆరో తరతగతిలో 60 సీట్ల చొప్పున మొత్తం 23 విద్యాలయాల్లో 1,380(690 బాలురు, 690 బాలికలు) సీట్లు ఉన్నాయి. 

అర్హతలు: ఆరో తరతగతిలో ప్రవేశాలు పొందలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా 2023-24 లేదా 2024-25 విద్యాసంవత్సరంలో ఏదైనా ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూల్‌లో 5వ తరగతి చదివి ఉండాలి. లేదా ఇంటివద్దనే ఐదో తరగతి చదివిన వారు కూడా అర్హలే. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్ష(పట్టణ ప్రాంతం), రూ.లక్షన్నర(గ్రామీణ ప్రాంతం) మించకూడదు.

వయోపరిమితి: మార్చి 31, 2025 నాటికి ఆరో తరగతికి 10-13 ఏళ్ల మధ్య ఉండాలి. 31.03.2012 నుంచి 31.03.2015 మధ్య జన్మించి ఉండాలి. దివ్యాంగులకు రెండేళ్ల సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: రాత పరీక్ష, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం: ఆరో తరగతికి 100 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. మెంటల్‌ ఎబిలిటీ (50 ప్రశ్నలు), అరిథ్‌మెటిక్‌ (25 ప్రశ్నలు), తెలుగు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్ (25 ప్రశ్నలు) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. తెలుగు, ఇంగ్లిష్‌ మీడియంలో పరీక్ష నిర్వహిస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.100. 

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 16-02-2025.

ప్రవేశ పరీక్ష నిర్వహణ: 16.03.2025.

పరీక్ష ఫలితాల ప్రకటన: 31.03.2025.

మొదటి దశ ప్రవేశాలు: 31.03.2025.

Website:https://tsemrs.telangana.gov.in/

Apply online:https://telanganaemrs.cgg.gov.in/TGEMRSWEB/