Published on Oct 23, 2024
Admissions
తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఉద్యోగ పరీక్షలకు ఉచిత శిక్షణ
తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఉద్యోగ పరీక్షలకు ఉచిత శిక్షణ

తెలంగాణ‌ రాష్ట్రం గిరిజన సంక్షేమ శాఖ పరిధి వరంగల్‌లోని ఎస్టీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో టీజీపీఎస్సీ గ్రూప్‌-1, 2, 3, 4, బ్యాంకింగ్, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ, పోలీసు ఇతర ఉద్యోగ పరీక్షల కోసం ఉచిత ఫౌండేషన్‌ కోర్సు అందించనున్నారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల  ఎంపిక ఉంటుంది. ఉచిత స్టడీ మెటీరియల్‌ సమకూరుస్తారు.

వివరాలు:

టీజీపీఎస్సీ గ్రూప్‌-1, 2, 3, 4, బ్యాంకింగ్, పోలీసు, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ తదితర ఉద్యోగ పరీక్షలకు ఉచిత ఫౌండేషన్‌ కోర్సు 

అర్హతలు:

గిరిజన తెగలకు చెందిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.

అభ్యర్థి తల్లిదండ్రులు వార్షిక ఆదాయం రూ.2 లక్షలు మించకూడదు.

ఉమ్మడి వరంగల్ జిల్లా (ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం)కు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

సీట్ల కేటాయింపు: మహిళలకు 33 1/3 శాతం, దివ్యాంగులకు 3 శాతం సీట్లను కేటాయించారు.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 27.10.2024.

హాల్ టికెట్ జనరేషన్/ డౌన్‌లోడ్ తేదీ: 31.10.2024.

స్క్రీనింగ్ టెస్ట్ తేదీ: 03.11.2024.

ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 07.11.2024.

పూర్తి వివరాలకు: 8374417424 & 9441003400

Website:https://studycircle.cgg.gov.in/ForwardingAction.do?status=stde

Apply online:https://studycircle.cgg.gov.in/TSTWPETCWarGroupsRegistration2425.do