తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) 2024-II నిర్వహణకు సంబంధించి రాష్ట్ర విద్యా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు:
* తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)-2024-II
అర్హతలు: ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే టెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. వారే టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్(టీఆర్‌టీ) రాయడానికి అర్హులు. టెట్ పేపర్-1కి డీఈడీ అర్హత ఉండాలి. టెట్ పేపర్-2కి డిగ్రీ, బీఈడీ ఉండాలి. సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాయొచ్చు.
పరీక్ష విధానం: టెట్‌లో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 150 మార్కులు. జనరల్ కేటగిరీలో 90, బీసీలు-75, ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులు 60 మార్కులు సాధిస్తే అర్హత పొందొచ్చు. వారే టీఆర్‌టీ రాసేందుకు అర్హులవుతారు. టెట్ మార్కులకు 20 శాతం, టీఆర్‌టీలో వచ్చిన మార్కులకు 80 శాతం వెయిటేజీ ఇచ్చి అభ్యర్థులకు తుది ర్యాంకు నిర్ణయిస్తారు. ప్రాథమిక పాఠశాలల్లోని సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) ఉద్యోగాలకు అర్హత పొందేందుకు పేపర్-1, ఉన్నత పాఠశాలల్లోని స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) ఉద్యోగాలకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. పేపర్-2లో మళ్లీ గణితం, సైన్స్; సాంఘికశాస్త్రం రెండు వేర్వేరు పేపర్లు ఉంటాయి.
దరఖాస్తు ఫీజు: టెట్ పరీక్ష ఫీజును ఈసారి తగ్గించారు. గతంలో ఇది ఒక పేపరుకు రూ.1000, రెండు పేపర్లకు రూ.2000గా ఉండేది. ఇప్పుడు దాన్ని రూ.750, రూ.1000గా నిర్ణయించారు. మొన్న మే నెలలో టెట్ రాసి అర్హత సాధించని వారు, ఒకవేళ సాధించినా స్కోర్ పెంచుకోవడానికి మళ్లీ పరీక్ష రాసే వారికి ఎటువంటి ఫీజు ఉండదు. టెట్ ఫలితాలు ఫిబ్రవరి 5న ప్రకటించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.
ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: అభ్యర్థులు నవంబర్ 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపు తేదీలు: 07.11.2024 నుంచి 20.11.2024 వరకు.
అన్ని పని దినాల్లో హెల్ప్ డెస్క్ సేవలు: 07.11.2024 నుంచి 05.02.2025 వరకు.
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ ప్రారంభం: 26.12.2024 నుంచి.
పరీక్ష తేదీలు: జనవరి 1-20 తేదీల మధ్య ఆన్‌లైన్‌లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరుగుతుంది.
పరీక్ష సమయం: ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు ఉంటుంది.
పరీక్ష ఫలితాలు విడుదల తేదీ: 05.02.2025.
టెట్ కార్యాలయం టెలిఫోన్ నంబర్: 7075088812 / 7075028881 డొమైన్ సంబంధిత సమస్యల కోసం
Website: https://tgtet2024.aptonline.in/tgtet/
Apply online: https://tgtet2024.aptonline.in/tgtet/FeePaymentFront