తెలంగాణ రాష్ట్ర హైకోర్టు, హైదరాబాద్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టుల కోసం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్, రిక్రూట్‌మెంట్ బై ట్రాన్స్‌ఫర్ (బదిలీ ద్వారా నియామకం) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ నెం. 45/2025 విడుదల చేసింది.
వివరాలు:
సివిల్ జడ్జ్ (జూనియర్ డివిజన్): 94 ఖాళీలు
(డైరెక్ట్ రిక్రూట్‌మెంట్-66; ట్రాన్స్‌ఫర్ ద్వారా: 28 ఖాళీలు)
అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి లా డిగ్రీతో పాటు, బార్ కౌన్సిల్‌లో అడ్వకేట్‌గా నమోదు చేసి ఉండాలి. మూడు సంవత్సారాలు తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో లేదా దాని నియంత్రణలో పనిచేసే కోర్టులలో అడ్వకేట్‌గా లేదా ప్లీడర్‌గా ప్రాక్టీస్ చేసి ఉండాలి.
వయోపరిమితి: 23 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.77,840- రూ.1,36,520.
ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష, వైవా-వోస్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: ఓసీ/బీసీలకు రూ.1,250; ఈడబ్ల్యూఎస్/పీడబ్ల్యూబీడీ/ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.600.
పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 29.12.2025.