ఇటీవల విడుదల చేసిన రాష్ట్ర సామాజిక, ఆర్థిక సర్వే వివరాల ప్రకారం తెలంగాణలో రేషన్ కార్డుల సంఖ్య 1,05,07,879గా ఉంది. రేషన్ కార్డుల సంఖ్యలో హైదరాబాద్ తొలి స్థానంలో నిలవగా.. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. లబ్ధిదారులకు రేషన్ అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 17,348 చౌక ధరల దుకాణాలున్నాయి.
హైదరాబాద్‌లో సగటున ఒక్కో రేషన్ షాప్ పరిధిలో 1,281 కార్డులున్నాయి. నల్గొండ జిల్లాలో ఒక్కో రేషన్ దుకాణం పరిధిలో 512 కార్డులున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ రేషన్ వ్యవస్థ బలంగానే కొనసాగుతోంది. నల్గొండ, నిజామాబాద్‌లు ముందంజలో ఉన్నాయి. ఆ తర్వాత అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 4,69,865 కార్డులున్నాయి.