హైదరాబాద్‌లోని తెలంగాణ పారా మెడికల్ బోర్డు 2024-25 విద్యా సంవత్సరానికి తెలంగాణలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రైవేట్ పారామెడికల్ కళాశాలల్లో వివిధ పారామెడికల్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 40 ప్రభుత్వ పారామెడికల్ సంస్థల్లో మొత్తం 3122 సీట్లు ఉన్నాయి.
వివరాలు:
1. డిప్లొమా ఇన్ పెర్ఫ్యూజన్ టెక్నీషియన్
2. డిప్లొమా ఇన్ ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్
3. డిప్లొమా ఇన్ మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్
4. డిప్లొమా ఇన్ హాస్పిటల్ ఫుడ్ సర్వీస్ మేనేజ్‌మెంట్ టెక్నీషియన్
5. డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్‌మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్
6. డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నీషియన్
7. డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్
8. డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్
9. డిప్లొమా ఇన్ రెస్పిరేటరీ థెరపీ టెక్నీషియన్
10. డిప్లొమా ఇన్ రేడియో థెరపీ టెక్నీషియన్
11. డిప్లొమా ఇన్ ఆప్టోమెట్రీ టెక్నీషియన్
12. డిప్లొమా ఇన్ డెంటల్ టెక్నీషియన్
13. డిప్లొమా ఇన్ డెంటల్ హైజీనిస్ట్
14. డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నీషియన్
15. డిప్లొమా ఇన్ క్యాథ్‌లాబ్ టెక్నీషియన్
16. డిప్లొమా ఇన్ రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్
17. డిప్లొమా ఇన్ డార్క్ రూమ్ అసిస్టెంట్
18. డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నీషియన్
19. డిప్లొమా ఇన్ కార్డియాలజీ టెక్నీషియన్
20. డిప్లొమా ఇన్ ఎమర్జెన్సీ పారామెడిక్ టెక్నీషియన్
21. డిప్లొమా ఇన్ మైక్రోసర్జరీ టెక్నీషియన్
అర్హతలు: రెండేళ్ల కాలపరిమితి గల ఈ పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్ బైపీసీ ఉత్తీర్ణులై ఉండాలి.
వ్యవధి: ఈ కోర్సుల వ్యవధి రెండేళ్లు. ఈ కోర్సులకు సంబంధించి ఇంగ్లిష్ మీడియంలో బోధన ఉంటుంది.
ఎంపిక విధానం: బైపీసీ విద్యార్థులు లేకుంటే ఎంపీసీ విద్యార్థులకు ప్రాధాన్యం ఇస్తారు. సీట్లను ప్రభుత్వ రిజర్వేషన్ల మేరకు ప్రతిభ ఆధారంగా కేటాయిస్తారు.
ఆఫ్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 30-10-2024.
కౌన్సెలింగ్ నిర్వహణ, అభ్యర్థుల సీటు కేటాయింపు: 13-11-2024.
తరగతులు ప్రారంభం: 25-11-2024.
Website:https://tgpmb.telangana.gov.in/Home/GetAdmissionNotifications