Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Jan 30, 2026
Current Affairs
తెలంగాణలో పెరిగిన రెవెన్యూ లోటు
తెలంగాణలో పెరిగిన రెవెన్యూ లోటు
  • తెలంగణలో గడిచిన ఆరేళ్లలో రెవెన్యూ లోటు పెరిగిందని కేంద్ర సామాజిక, ఆర్థిక సర్వే 2025-26 వెల్లడించింది. జీఎస్‌డీపీ వృద్ధితో పోల్చితే సొంత రెవెన్యూ రాబడి తగ్గడం, ఆదాయం కంటే నగదు బదిలీ లాంటి ఖర్చులు పెరగడంతో ఈ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపింది. 2019లో మిగులు రాష్ట్రం నుంచి 2025 నాటికి రెవెన్యూ లోటులోకి వెళ్లిందని నివేదిక వివరించింది. అదే సమయంలో తెలంగాణలో ఆహారం, ఇంధనం సహా ప్రజలు రోజూ వినియోగించే వస్తువుల ధరలు ఈ ఏడాదికి స్థిరంగా ఉన్నాయని, ప్రస్తుత ఏడాదికి హెడ్‌లైన్‌ ద్రవ్యోల్బణం 0.20 శాతంగా ఉందని వెల్లడించింది. 
  • ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటైన ‘తెలంగాణ వీహబ్‌’ ఆవిష్కరణల్ని పెట్టుబడిదారులతో అనుసంధానం చేసే గొప్ప వేదికగా సర్వే వెల్లడించింది. మహిళా సాధికారతలో ఈ ప్రాజెక్టు ఆదర్శంగా ఉందని తెలిపింది.