Published on Sep 20, 2024
Government Jobs
తెలంగాణలో నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు
తెలంగాణలో నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో 2,050 నర్సింగ్‌ ఆఫీసర్‌ (స్టాఫ్‌నర్సు) పోస్టుల భర్తీకి వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

మొత్తం పోస్టులు: 2,050

వివరాలు:

జోన్ల వారీగా పోస్టుల ఖాళీలు: జోన్‌ 1- 241, జోన్‌ 2- 86, జోన్‌ 3- 246, జోన్‌ 4- 353, జోన్‌ 5- 187, జోన్‌ 6- 747, జోన్‌ 7-114.

శాఖల వారీగా ఖాళీలు:

1. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్/ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్: 1,576 పోస్టులు

2. తెలంగాణ వైద్య విధాన పరిషత్: 332 పోస్టులు

3. ఆయుష్: 61 పోస్టులు

4. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్: 01 పోస్టు

5. ఎంఎన్‌జే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ అండ్‌ రీజినల్ క్యాన్సర్ సెంటర్: 80 పోస్టులు

అర్హతలు: జనరల్ నర్సింగ్, మిడ్‌వైఫరీ (జీఎన్‌ఎం) లేదా బీఎస్సీ (నర్సింగ్) ఉత్తీర్ణతతో పాటు తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో వివరాల నమోదు చేసుకొని ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు కనిష్ఠ వయోపరిమితి 18 ఏళ్లు. గరిష్ఠ వయోపరిమితి గతంలో 44 ఏళ్లు ఉండగా తాజాగా 46 ఏళ్లకు పెంచారు. గరిష్ఠ వయోపరిమితిలో దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్ల సడలింపు, ఎక్స్‌సర్వీస్‌మెన్, ఎన్‌సీసీ సర్టిఫికెట్‌ ఉన్నవారికి మూడేళ్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. 

పే స్కేల్: నెలకు రూ.36,750 - రూ.1,06,990.

ఎంపిక విధానం: రాతపరీక్షకు 80 పాయింట్లు ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు, సంస్థల్లో పనిచేసిన కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సర్వీసుకు 20 పాయింట్ల వెయిటేజీ ఉంటుంది.

రాత పరీక్ష: కంప్యూటర్ ఆధారిత పరీక్షలో 80 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది.

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట.

దరఖాస్తు, పరీక్ష రుసుము: రూ.700. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌, దివ్యాంగులు, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు రూ.500.

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 28.9.2024.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 14-10-2024.

దరఖాస్తు సవరణ తేదీలు: 16.10.2024 నుంచి 17.10.2024 వరకు.

పరీక్ష తేదీ (సీబీటీ): 17.11.2024.

Website:https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm