తెలంగాణ రాష్ట్రంలోని టీజీఎస్‌ఆర్టీసీలో తొలి మహిళా బస్ డ్రైవర్‌గా సరిత 2025. జూన్ 15న విధుల్లోకి వచ్చారు. ఆమెది యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్యతండా. సరిత తొలి రోజు హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు బస్ నడిపారు. ఇన్నిరోజులు దేశ రాజధాని దిల్లీలో డ్రైవర్‌గా విధులు నిర్వర్తించారు.