Published on Sep 26, 2024
Admissions
తెలంగాణలో ఐటీఐ కోర్సు అడ్మిషన్లు-2024
తెలంగాణలో ఐటీఐ కోర్సు అడ్మిషన్లు-2024

తెలంగాణ ప్రభుత్వం, ఉపాధి- శిక్షణ కమిషనర్‌, హైదరాబాద్ 2024-25 సెషన్‌కు గాను రాష్ట్రంలోని ప్రభుత్వ/ ప్రైవేట్ ఐటీఐల్లో ఐదో విడత ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వివరాలు:

ఐదో విడత ఐటీఐ కోర్సు ప్రవేశాలు 2024-25

ట్రేడ్: కార్పెంటర్, సీవోపీఏ, డ్రాఫ్ట్స్‌మ్యాన్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఫౌండ్రీమ్యాన్, మెషినిస్ట్, ప్లంబర్, టర్నర్, వెల్డర్, వైర్‌మ్యాన్ తదితరాలు.

అర్హత: ట్రేడును అనుసరించి 8వ తరగతి, 10వ తరగతి ఉత్తీర్ణత.

వయోపరిమితి: 14 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి లేదు.

ఎంపిక: అకడమిక్ మెరిట్/ గ్రేడింగ్‌ పాయింట్లు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. 

దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్‌లో వ్యక్తిగత, విద్యార్హతతో పాటు ఐటీఐ/ ట్రేడ్‌ వివరాలను ప్రాధాన్యతా క్రమంలో నమోదు చేసుకోవాలి. ప్రభుత్వ/ ప్రైవేట్‌ ఐటీఐ కళాశాల్లో ప్రవేశాలు పొందాలనుకునే అభ్యర్థులు ఆయా కళాశాలల్లో 25-09-2024 నుంచి 28-09-2024 వరకు ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావచ్చు, 

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 28-09-2024.

Website:https://iti.telangana.gov.in/

Apply online:https://tsiti.ucanapply.com/univer/public/secure?app_id=UElZMDAwMDA2NQ==