పట్టణ ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంపొందించడం, పర్యావరణ సమతుల్యత కాపాడటం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న నగర్ వన్ యోజన పథకం కింద తెలంగాణకు కొత్తగా ఆరు అర్బన్ ఫారెస్ట్ పార్క్‌లు మంజూరయ్యాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ ఆరింటికి మొదటి విడతలో మొత్తం రూ.8.26 కోట్లను కేంద్రం మంజూరు చేసింది.
నగర్ వన్ యోజన కింద ఏర్పాటయ్యే అర్బన్ ఫారెస్ట్‌లలో స్థానికంగా పెరిగే మొక్కలకు ప్రాధాన్యం ఇస్తారు. ఆదిలాబాద్ జిల్లా మావల, యాపల్‌గూడ; మంచిర్యాల జిల్లా ఇందారం, చెన్నూర్; మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా యెల్లంపేట, చెంగిచెర్లలో వీటిని ఏర్పాటు చేస్తారు.