Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Dec 22, 2025
Current Affairs
తీర రక్షణ దళంలోకి ‘అమూల్య’
తీర రక్షణ దళంలోకి ‘అమూల్య’
  • మెరుపు వేగంతో సాగరజలాల్లో గస్తీ నిర్వహించే నౌక అమూల్య 2025, డిసెంబరు 19న భారత తీర రక్షణ దళంలో చేరింది. దీంతో తూర్పు తీరంలో కోస్ట్‌గార్డ్‌ పోరాట సామర్థ్యానికి మరింత దన్ను లభించినట్లయింది. ఇది కొత్త తరం అదమ్య తరగతి ఫాస్ట్‌ పెట్రోల్‌ వెసెల్స్‌ శ్రేణిలో మూడోది. నిఘా, గాలింపు, సహాయ చర్యలు, స్మగ్లింగ్‌ నివారణ, కాలుష్య ప్రతిస్పందన లాంటి కార్యకలాపాలను ఇది చేపడుతుంది. 
  • ఈ నౌక పొడవు 51 మీటర్లు. ఇందులో 3వేల కిలోవాట్ల సామర్థ్యమున్న రెండు అధునాతన డీజిల్‌ ఇంజిన్లు ఉన్నాయి. ఈ నౌక గరిష్ఠంగా 50 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఏకబిగిన 1500 నాటికల్‌ మైళ్ల దూరం ప్రయాణించగలదు. దీన్ని గోవా షిప్‌యార్డ్‌ నిర్మించింది.