రాజస్థాన్‌లో గత కొన్ని రోజులుగా త్రివిధ దళాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న త్రిశూల్ విన్యాసాలు 2025, నవంబరు 13న ముగిశాయి. ఇందులో 30 వేల మంది సైనికులు, పలు యుద్ధ విమానాలు, 25 నౌకలు, జలాంతర్గాములు పాల్గొన్నాయి. ఈ విన్యాసాలు త్రివిధ దళాల సత్తాకు ప్రతీక అని ప్రభుత్వం పేర్కొంది.
థార్ ఎడారి నుంచి కచ్ ప్రాంతం వరకు గత కొన్ని రోజులుగా త్రిశూల్‌లో భాగంగా పలు విన్యాసాలు జరిగాయి. చివరగా అంపెక్స్ విన్యాసాలు అరేబియా సముద్రంలో జరిగాయి.