ఇక్రిశాట్, భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐకార్), రాజస్థాన్ వ్యవసాయ పరిశోధన సంస్థలు సంయుక్తంగా ఆర్‌హెచ్‌బీ 273 పేరిట ప్రపంచంలోనే మొట్టమొదటి త్రివిధ సజ్జ సంకర (త్రీ వే పెర్ల్ మిల్లెట్ హైబ్రిడ్) రకాన్ని రూపొందించాయి. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ దాన్ని విడుదల చేశారు. సాధారణ హైబ్రిడ్ రకాలు రెండు మాతృకల నుంచి తయారైతే, ఈ త్రివిధ హైబ్రిడ్ మూడు మాతృకల కలయికతో రూపొందింది. ఇందులో అధిక దిగుబడి, నాణ్యమైన పశుగ్రాస లక్షణాలు ఉంటాయి.