తూర్పు నావికాదళ చీఫ్ (ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్)గా వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా 2025 అక్టోబరు 31న నియమితులయ్యారు. కమాండ్ ముఖ్య కార్యాలయం ఐఎన్‌ఎస్ సర్కార్స్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఈఎన్‌సీ చీఫ్‌గా పని చేసిన వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ స్థానంలో ప్రస్తుత నియామకం జరిగింది. సంజయ్ భల్లా 1989 జనవరి 1న భారత నౌకాదళంలో చేరారు.