Published on Oct 16, 2024
Current Affairs
తూర్పు ఆసియా సదస్సు
తూర్పు ఆసియా సదస్సు

లావోస్‌ రాజధాని వియంటియాన్‌లో జరిగిన 19వ తూర్పు ఆసియా సదస్సులో 2024, అక్టోబరు 11న ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణలు దక్షిణాది దేశాలపై అత్యంత ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని ఆయన పేర్కొన్నారు. యురేసియా, పశ్చిమాసియాల్లో వీలైనంత త్వరగా శాంతి, సుస్థిరత నెలకొనాలని పిలుపునిచ్చారు. 

థాయ్‌లాండ్‌ ప్రధానితో వాణిజ్యంపై చర్చలు

రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు, సాంస్కృతిక సంబంధాలకు ఊతమిచ్చేందుకు చేపట్టాల్సిన చర్యలపై థాయ్‌లాండ్‌ ప్రధాని పేటోంగ్టార్న్‌ షినవత్రతో ప్రధాని మోదీ 2024, అక్టోబరు 11న లావోస్‌లో చర్చలు జరిపారు. షినవత్రతో మోదీ భేటీ కావడం ఇదే తొలిసారి.