భారతీయ తీరగస్తీ దళంలోకి కొత్తగా ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌక ‘అదమ్య’ చేరిందని కోస్ట్‌గార్డ్ వర్గాలు 2025, జూన్ 28న తెలిపాయి. ‘ఫాస్ట్ పాట్రోల్ వెసల్(ఎఫ్‌పీవీ)’గా పిలిచే దీన్ని గోవా షిప్‌యార్డులో తయారు చేశారు. తీరంలో నిఘా, మానవ సహాయ చర్యల్లో ఇది చురుగ్గా పాల్గొంటుంది. ఇందులో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వ్యవస్థలు ఉన్నాయి.