ఒమన్ ఉప ప్రధాని (రక్షణ వ్యవహారాలు) సయ్యిబ్ షిహాబ్ బిన్ తారిక్ అల్ సయిద్‌తో 2025, డిసెంబరు 17న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమై పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై చర్చించారు. మోదీ ఇథియోపియా పర్యటనను ముగించుకొని ఒమన్ చేరుకున్నారు. రెండు దేశాల మధ్య ఉన్న మైత్రీ బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా సమాలోచనలు జరిపారు. భారత్-ఒమన్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 ఏళ్లవుతుండటాన్ని పురస్కరించుకొని ఏర్పాటుచేసిన ఓ ఎగ్జిబిషన్‌ను మోదీ తిలకించారు. ఆయన ఒమన్‌లో పర్యటించడం ఇది రెండోసారి.