Published on Oct 26, 2024
Government Jobs
తమిళనాడు సెంట్రల్‌ యూనివర్సిటీలో నాన్ టీచింగ్‌ ఖాళీలు
తమిళనాడు సెంట్రల్‌ యూనివర్సిటీలో నాన్ టీచింగ్‌ ఖాళీలు

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు (సీయూటీఎన్‌) డైరెక్ట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న  నాన్‌ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 15

వివ‌రాలు:

1. ఇన్ఫర్మేషన్ సైంటిస్ట్: 01

2. అసిస్టెంట్ లైబ్రేరియన్: 01

3. ఎల్‌డీసీ: 04

4. మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 03

5. లైబ్రరీ అటెండెంట్: 02

6. ల్యాబొరేటరీ అటెండెంట్: 01

7. హాస్టల్ అటెండెంట్: 02

8. కన్సల్టెంట్ ఇంటర్నల్ అడిట్ (కాంట్రాక్టు): 01

అర్హత: పదోతరగతి, ఇంటర్మీడియట్ పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: ఇన్ఫర్మేషన్ సైంటిస్ట్, అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులకు 40 ఏళ్లు; కన్సల్టెంట్ ఇంటర్నల్ అడిట్ పోస్టులకు 65 ఏళ్లు; మిగతా పోస్టులకు 32 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: రూ.750; రూ.ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 31-10-2024.

Website:https://cutn.ac.in/