తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా టీఎంబీ శాఖల్లో సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ (ఎస్‌సీఎస్‌ఈ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 124
వివరాలు:
రాష్ట్రాల వారీ ఖాళీలు: ఆంధ్రప్రదేశ్ 241, అస్సాం 1, గుజరాత్ 34, హరియాణా 2, కర్ణాటక 14, కేరళ 2, మధ్యప్రదేశ్ 2, మహారాష్ట్ర 22, రాజస్థాన్ 2, తెలంగాణ 18, ఉత్తరాఖండ్ 1, పశ్చిమ్ బెంగాల్ 2, అండమాన్ అండ్ నికోబార్ 1, దాద్రా నగర్ హవేలీ 1, దిల్లీ 2.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60% మార్కులతో ఆర్ట్స్ అండ్ సైన్స్ విభాగాల్లో అండర్ గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 30.09.2024 నాటికి 26 ఏళ్లు మించకూడదు.
బేసిక్ పే: రూ.32,000.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఆధారిత రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.1000.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్/ ఎడిట్ ఆప్షన్ తేదీలు: 28.02.2025 నుంచి 16.03.2025 వరకు.
అప్లికేషన్ ఫీజు చెల్లింపు తేదీలు: 28.02.2025 నుంచి 16.03.2025 వరకు.
ఆన్‌లైన్ పరీక్ష: ఏప్రిల్ 2025.
ఆన్‌లైన్ పరీక్ష ఫలితాల ప్రకటన: మే 2025.
Website:https://www.tmbnet.in/tmb_careers/
Apply online:https://ibpsonline.ibps.in/tmbfeb25/