Published on Nov 11, 2024
Private Jobs
తమిళనాడు మర్కంటైల్ బ్యాంకులో సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
తమిళనాడు మర్కంటైల్ బ్యాంకులో సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా టీఎంబీ శాఖల్లో సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ (ఎస్‌సీఎస్ఈ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 170

వివరాలు:

రాష్ట్రాల వారీ ఖాళీలు: ఆంధ్రప్రదేశ్ 24, అస్సాం 1, ఛత్తీస్‌గఢ్ 1, గుజరాత్ 34, హరియాణా 2, కర్ణాటక 32, కేరళ 5, మధ్యప్రదేశ్ 2, మహారాష్ట్ర 38, రాజస్థాన్ 2, తెలంగాణ 20, ఉత్తరాఖండ్ 1, పశ్చిమ్‌ బెంగాల్ 2, అండమాన్ అండ్‌ నికోబార్ 1, దాద్రా నగర్ హవేలీ 1, దిల్లీ 4.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత రంగంలో పని అనుభవం ఉంటే ప్రాధాన్యం ఉంటుంది.

వయోపరిమితి: 30.09.2024 నాటికి 26 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ఫేజ్-I ఆన్‌లైన్ పరీక్ష, ఫేజ్-II పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.1000.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్/ ఎడిట్‌ ఆప్షన్‌ తేదీలు: 06.11.2024 నుంచి 27.11.2024 వరకు.

అప్లికేషన్ ఫీజు చెల్లింపు తేదీలు: 06.11.2024 నుంచి 27.11.2024 వరకు.

ఆన్‌లైన్ పరీక్ష: డిసెంబరు 2024.

ఆన్‌లైన్ పరీక్ష ఫలితాల ప్రకటన: డిసెంబరు 2024/ జనవరి 2025.

ఇంటర్వ్యూ కాల్ లెటర్ జారీ: జనవరి 2025.

ఎంపిక జాబితా విడుదల: ఫిబ్రవరి/ మార్చి 2025.

Website:https://www.tmbnet.in/tmb_careers/

Apply online:https://ibpsonline.ibps.in/tmbloct24/