తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ లిమిటెడ్ (టీఎంబీ) దేశవ్యాప్తంగా ఉన్న తన శాఖల్లో బ్రాంచ్ హెడ్ (మేనేజర్/ సీనియర్‌మేనేజర్/అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 20
వివరాలు:
రాష్ట్రాల వారీ ఖాళీలు: ఆంధ్రప్రదేశ్ 1, కర్ణాటక 05, కేరళ 4, గుజరాత్ 02 మహారాష్ట్ర 03, రాజస్థాన్ 1, తెలంగాణ 02, పశ్చిమ్ బెంగాల్ 1, దిల్లీ 1.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఏదైన విభాగాల్లో గ్రాడ్యుయేట్ /పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
వయోపరిమితి: 31.12.2025 నాటికి 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ: 31.01.2026.