రిజిస్ట్రేషన్ శాఖలోని ప్రజాసేవలను పూర్తిస్థాయి కాగితరహితంగా మార్చేందుకు తమిళనాడు ప్రభుత్వం డిజిటల్ విధానాన్ని తీసుకొచ్చింది. సీఎం స్టాలిన్ ‘స్టార్ 3.0 స్ప్రింట్ 1’ సాంకేతిక వ్యవస్థను 2026, జనవరి 22న ప్రారంభించారు. ఆధార్ కార్డు ఓటీపీ, బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా తొలివిడతగా 18 రకాల సేవలను పొందేలా ఏర్పాట్లు చేశారు.
భూముల రిజిస్ట్రేషన్లను ఆధార్ వెరిఫికేషన్ పూర్తయ్యాక సబ్‌రిజిస్ట్రార్ డిజిటల్ సంతకంతో రిజిస్టర్ అయ్యేలా, ఆన్‌లైన్ ద్వారా ఎలక్ట్రానిక్ పత్రాన్ని పొందేలా చేస్తున్నారు.