Published on Aug 20, 2025
Current Affairs
తేజస్‌ మార్క్‌-1ఏ
తేజస్‌ మార్క్‌-1ఏ

రూ.62వేల కోట్లతో 97 తేజస్‌ మార్క్‌-1ఏ యుద్ధవిమానాల కొనుగోలుకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు రక్షణ శాఖ 2025, ఆగస్టు 19న తెలిపింది.

వీటిని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) ఉత్పత్తి చేయనుంది.

ఈ స్వదేశీ యుద్ధవిమానానికి దక్కిన రెండో ఆర్డర్‌ ఇది. 

రూ.48వేల కోట్లతో 83 యుద్ధవిమానాల సమీకరణకు కేంద్రం కొన్నేళ్ల కిందట ఆమోదం తెలిపింది.