దేశీయంగా అభివృద్ధి చేసిన తేజస్ యుద్ధవిమానం నుంచి 2025, మార్చి 12న గగనతలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే అస్త్ర క్షిపణిని విజయవంతంగా ప్రయోగించారు.
ఒడిశాలోని చాందీపుర్‌లో దీన్ని చేపట్టినట్లు రక్షణశాఖ వెల్లడించింది. ఈ ప్రయోగ పరీక్ష సందర్భంగా గాల్లో ఎగురుతున్న లక్ష్యాన్ని క్షిపణి నేరుగా కూల్చేసిందని తెలిపింది. క్షిపణిలోని అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేసినట్లు పేర్కొంది.