జూనియర్ షూటింగ్ ప్రపంచకప్‌లో మహిళల 25మీ పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్ తేజస్విని స్వర్ణం సాధించింది. 2025, మే 26న జూల్ (జర్మనీ)లో జరిగిన ఫైనల్లో తేజస్విని 31 స్కోర్ చేసి అగ్రస్థానంలో నిలవగా.. తటస్థ అథ్లెట్ అలీనా (29) రజతం గెలుచుకుంది. హంగేరికి చెందిన మరియం జాకో (23) కాంస్య పతకం సాధించింది.