దేశంలో రైలు ప్రమాదాలు 2004-14 నుంచి 2024-25 మధ్యకాలంలో ఏటా 171 నుంచి 64కు తగ్గిపోయాయని రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఆయన 2025, డిసెంబరు 12న రాజ్యసభలో ఈ విషయాన్ని వెల్లడించారు.
2004-14 మధ్య పదేళ్ల కాలంలో మొత్తం 1,711 ప్రమాదాలు జరగ్గా, 2014-25 మధ్యకాలంలో 709 జరిగాయని చెప్పారు. 2025-26లో ఈ నవంబరు వరకు 11 ప్రమాదాలు చోటుచేసుకున్నాయని తెలిపారు.