- ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఆధ్వర్యంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ రెపోరేటు (బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద తీసుకునే రుణాలకు చెల్లించే వడ్డీ)ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.25 శాతానికి చేర్చాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. 2024 డిసెంబరు 6న రెపో రేటు 6.50% కాగా.. ఏడాది తర్వాత ఇప్పుడు 5.25 శాతానికి దిగివచ్చింది. అంటే 2025లో రెపో రేటు 1.25% (ఫిబ్రవరిలో 0.25%, ఏప్రిల్‌లో 0.25%, జూన్‌లో 0.50%, డిసెంబరులో 0.25% చొప్పున) తగ్గింది.
- 2025-26కు జీడీపీ వృద్ధి అంచనాను 6.8% నుంచి 7.3 శాతానికి ఆర్‌బీఐ పెంచింది.