Published on Mar 19, 2025
Government Jobs
డీసీహెచ్‌ఎస్‌ ప్రకాశం జిల్లాలో పోస్టులు
డీసీహెచ్‌ఎస్‌ ప్రకాశం జిల్లాలో పోస్టులు

ప్రకాశం జిల్లా, డీసీహెచ్‌ఎస్‌ పరిధిలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్స్, ఏరియా ఆసుపత్రుల్లో ఒప్పంద, ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 16

వివరాలు:

1. ఆడియోమెట్రిక్‌ టెక్నీషియన్‌: 01

2. ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌2: 02

3. థియేటర్‌ అసిస్టెంట్‌- 03

4. ఆఫీస్‌ సబార్డీనేట్‌: 02

5. పోస్ట్‌ మార్టం అసిస్టెంట్‌: 02

6. జనరల్‌ డ్యూటీ అటెండెంట్‌- 06

అర్హత: పోస్టును అనుసరించి టెన్త్‌, ఇంటర్మీడియట్‌, సంబంధిత విభాగంలో బీఎస్సీ ఉత్తీర్ణత, డీఎంఎల్‌టీ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏడాది అప్రెంటీస్‌షిప్‌ చేసి ఉండాలి. 

వయోపరిమితి: 01.07.2024 తేదీ నాటికి 42 మించకూడదు. ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

జీతం: ఆడియోమెట్రిక్‌ టెక్నీషియన్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌2 పోస్టులకు రూ.32,670; ఇతర పోస్టులకు రూ.15,000.

దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.500, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.300.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, ఉద్యోగానుభం తదితరాల ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా.

చిరునామా: ఆఫీస్‌ ఆఫ్ ది డీసీహెచ్‌ఎస్‌ ప్రకాశం చిరునామాకు మార్చి 24 లోపు పంపించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 24-03-2025.

Website:https://prakasam.ap.gov.in/